ఐపీఎల్ ఫైనల్ కు సర్వం సిద్ధం... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్
- టైటిల్ కోసం గుజరాత్, రాజస్థాన్ అమీతుమీ
- నేటితో ముగియనున్న ఐపీఎల్
- అల్జారీ జోసెఫ్ స్థానంలో ఫెర్గుసన్ ను తీసుకున్న టైటాన్స్
- ఇరు జట్లలోనూ హేమాహేమీలు
ఐపీఎల్ 15వ సీజన్ ఫైనల్ లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఎంతో ఒత్తిడితో కూడుకున్న టైటిల్ పోరులో చేజింగ్ చేయడం ఎంతో కష్టమని గ్రహించిన రాజస్థాన్ సారథి సంజు శాంసన్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ తీసుకున్నాడు.
ఈ టైటిల్ మ్యాచ్ కోసం గుజరాత్ టైటాన్స్ జట్టులో ఒక మార్పు చేసినట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెల్లడించాడు. పేసర్ అల్జారీ జోసెఫ్ స్థానంలో లాకీ ఫెర్గుసన్ జట్టులోకి వచ్చినట్టు తెలిపాడు. అటు, తమ జట్టులో ఎలాంటి మార్పులు లేవని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ పేర్కొన్నాడు. కాగా, సొంతగడ్డపై అభిమానుల నడుమ ఆడుతుండడం గుజరాత్ టైటాన్స్ కు అదనపు బలం అయినా, టాస్ ఓడిపోవడం ప్రభావం చూపించే అవకాశాలున్నాయి.
గుజరాత్ టైటాన్స్ జట్టు...
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా, శుభ్ మాన్ గిల్, మాథ్యూ వేడ్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిశోర్, లాకీ ఫెర్గుసన్, యశ్ దయాళ్, మహ్మద్ షమీ.
రాజస్థాన్ రాయల్స్ జట్టు...
సంజు శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, షిమ్రోన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, ఒబెద్ మెక్ కాయ్, యజువేంద్ర చహల్.