జూన్ మొదటివారంలో తెలంగాణ కాంగ్రెస్ 'చింతన్ శిబిర్'... కమిటీ చైర్మన్ గా భట్టి
- గాంధీభవన్ లో ముగిసిన సమావేశం
- జూన్ 1, 2 తేదీల్లో చింతన్ శిబిర్
- ఏఐసీసీ ఆదేశాలతో కమిటీ ఏర్పాటు
- కార్యదర్శిగా మహేశ్వర్ రెడ్డి
తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా జూన్ మొదటివారంలో చింతన్ శిబిర్ సదస్సు నిర్వహించనుంది. దీనిపై చర్చించేందుకు హైదరాబాదు గాంధీ భవన్ లో కాంగ్రెస్ వర్గాలు సమావేశం అయ్యాయి. ఈ సమావేశం కొద్దిసేపటి కిందట ముగిసింది. జూన్ 1, 2 తేదీల్లో తెలంగాణ కాంగ్రెస్ చింతన్ శిబిర్ నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమం నిర్వహణ కోసం కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఏఐసీసీ ఆదేశాలతో ఈ కమిటీకి చైర్మన్ గా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కను, కన్వీనర్ గా మహేశ్వర్ రెడ్డిని నియమించారు. ప్రధానంగా ఆరు అంశాలపై చర్చ, గ్రామస్థాయికి పార్టీని తీసుకెళ్లడంపై ఈ కమిటీ ప్రధానంగా దృష్టి సారించనుంది. రాజకీయం, వ్యవసాయం, ఆర్థిక అంశాలు, మహిళా శిశు సంక్షేమం, సామాజిక న్యాయంపై కమిటీ చర్చించనుంది.