నేను చెప్పినట్టు వింటేనే, లేదంటే లేదన్న వార్న్!... దిగివచ్చిన రాజస్థాన్ జట్టు ఓనర్!
- తొలి సీజన్‌లో రాజస్థాన్‌ను విజేతగా నిలిపిన వార్న్
- రాజస్థాన్ జట్టు యజమానితో వార్న్ వాదులాట
- ఓ ఆటగాడి ఎంపికపై ససేమిరా అన్న వార్న్
- ఆ ఆటగాడిని ఎంపిక చేస్తే నేనెళ్లిపోతానంటూ బెదిరింపు
- చివరకు దిగివచ్చిన రాజస్థాన్ జట్టు యజమాని మనోజ్
- ఆటో బయోగ్రఫీ "నో స్పిన్"లో రాసుకున్న స్పిన్ దిగ్గజం
ఐపీఎల్ తొలి టైటిల్‌ను నెగ్గిన రాజస్థాన్ రాయల్స్ జట్టు... 14 ఏళ్ల తర్వాత మళ్లీ ఫైనల్ చేరింది. ఆదివారం రాత్రి అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్‌లో ఈ జట్టు గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ క్రమంలో నాడు తొలి టైటిల్‌ను నెగ్గిన రాజస్థాన్ జట్టు కెప్టెన్, ఇటీవలే గుండెపోటుతో మరణించిన స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ అందరికీ గుర్తుకు వస్తున్నాడు. తొలి సీజన్‌లో అసలు అంచనాలే లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టును వార్న్ ఏకంగా విజేతగా నిలిపిన వైనం ఆసక్తికరమే. నాడు వార్న్ రచించిన వ్యూహాలు, జట్టు యాజమాన్యంతో నడుచుకున్న విధానం...ఇలా పలు అంశాలపై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి.
ఈ సందర్భంగా జట్టు యజమాని మనోజ్ బదాలేతోనే ఓ విషయంలో వాదులాటకు దిగి మరీ యాజమాన్యం దిగివచ్చేలా చేసిన వార్న్ చాతుర్యం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇదేదో బయటి వ్యక్తులు చెప్పిన విషయం కాదు. షేన్ వార్న్ స్వయంగా తాను రాసుకున్న తన ఆటో బయోగ్రఫీ "నో స్పిన్" లోనిదే. ఐపీఎల్ తొలి సీజన్‌లో ఇతర జట్లన్నీ దేశవాళీ క్రికెటర్లే కెప్టెన్లుగా ఉండాలని పోటీ పడుతున్న సమయంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వార్న్‌ను కెప్టెన్‌గా ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆటగాళ్ల ఎంపిక విషయంలో మనోజ్ బదాలేతో షేన్ వార్న్ తీవ్రంగా విభేదించాడు. ప్రత్యేకించి ఓ ఆటగాడి ఎంపిక విషయంలో మాత్రం వార్న్ ససేమిరా అన్నాడట.
కీలక ఆటగాడిగా ఉన్న అతడిని ఎంపిక చేద్దామంటూ మనోజ్ బదాలే అడిగితే... వార్న్ అందుకు ససేమిరా అన్నాడట. "ఆ ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తీసుకోండి... అయితే నేను మాత్రం మీ జట్టుకు ఆడలేను. మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తాను" అని వార్న్ చెప్పాడట. దీంతో షాక్ తిన్న మనోజ్ ఆ ఆటగాడిని ఎంపిక చేస్తే నిజంగానే వెళ్లిపోతావా? అని అడిగితే... వెళతాను అంటూ వార్న్ బదులిచ్చాడట. దీంతో ఆ రోజుకు మిన్నకుండిపోయిన మనోజ్... మరునాడు వార్న్‌కు స్వయంగా ఫోన్ చేసి ఆ ఆటగాడిని ఎంపిక చేయకున్నా ఫరవా లేదులే అని చెప్పారట. ఈ వివరాలన్ని వార్న్ తన ఆటోబయోగ్రఫీలో రాసుకున్నాడు.