టీజీ వెంకటేశ్‌కు ఊరట... కబ్జా కేసు నుంచి ఎంపీ పేరు తొలగింపు
- జూబ్లీ హిల్స్‌లో భూకబ్జా కేసులో టీజీ వెంకటేశ్ పేరు
- టీజీ సమీప బంధువు విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో కబ్జా యత్నం
- ఈ కేసుతో తనకు సంబంధం లేదని ప్రకటించిన టీజీ వెంకటేశ్
బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌కు ఆదివారం భారీ ఊరట లభించింది. భూకబ్జా కేసు నుంచి ఆయన పేరును తొలగిస్తూ హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జూబ్లీ హిల్స్ పరిధిలోని ఏపీ జెమ్స్ అండ్ జ్యూవెలరీస్‌కు కేటాయించిన స్థలాన్ని ఆక్రమించేందుకు కర్నూలు జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు యత్నించిన సంగతి తెలిసిందే. మందీ మార్బలంతో వచ్చిన సదరు ముఠా... ఏపీ జెమ్స్ అండ్ జ్యూవెలర్స్‌కు చెందిన సెక్యూరిటీ గార్డులపై దాడికూడా చేసింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న బంజారా హిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాను తీసుకుని వ్యక్తి వచ్చిన టీజీ వెంకటేశ్ సమీప బంధువు టీజీ విశ్వ ప్రసాద్ అని పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంపై వివరాలు సేకరించిన పోలీసులు... అరెస్టైన నిందితులు చెప్పిన వివరాల మేరకు టీజీ వెంకటేశ్ పేరును కూడా నిందితుల జాబితాలో చేర్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీజీ వెంకటేశ్ ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అయినా కూడా పోలీసులు ఆయన పేరును కేసు నుంచి తొలగించలేదు. తాజాగా ఈ కేసులో మరింత మేర క్లారిటీ తెచ్చుకున్న పోలీసులు టీజీ వెంకటేశ్ పేరును ఎఫ్ఐఆర్ నుంచి తొలగించారు.