ప్రపంచవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం: నందమూరి బాలకృష్ణ
- గుంటూరు జేకేసీ రోడ్డులో టీడీపీ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్
- ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబుతో కలిసి ప్రారంభించిన బాలకృష్ణ
- రాజకీయ ఉద్దేశంతోనే అన్న క్యాంటీన్లను మూసేశారని ఆరోపణ
- వైసీపీ చేసిన అప్పుల ప్రభావమే పన్నుల బాదుడే బాదుడు అన్న బాలయ్య
పేదవాడి ఆకలి తీర్చాలన్న టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆశయం ఆధారంగా ఏర్పాటైన అన్న క్యాంటీన్లకు సంబంధించి ఎన్టీఆర్ తనయుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదివారం ఓ కీలక ప్రకటన చేశారు. తెలుగు ప్రజల సహకారంతో ప్రపంచవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటవుతాయని ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం గుంటూరులోని జేకేసీ రోడ్డులో టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటైన అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేదవాడి ఆకలి తీర్చాలనేదే ఎన్టీఆర్ ఆశయమని బాలకృష్ణ పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే గతంలో అన్న క్యాంటీన్లు ఏర్పాటయ్యాయని ఆయన తెలిపారు. రాజకీయ ఉద్దేశంతోనే వైసీపీ సర్కారు అన్న క్యాంటీన్లను రద్దు చేసిందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ దుర్మార్గాలు ప్రజల పాలిట శాపాలుగా మారాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసిందన్న బాలయ్య.. దాని ప్రభావమే ప్రజలపై పన్నుల బాదుడే బాదుడు అని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బాలయ్యతో పాటు టీడీపీ సీనియర్ నేతలు ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబులు పాల్గొన్నారు.