ఆఫ్రికా, మధ్య ఆసియా, తూర్పు ఆసియా, ఇరాన్ నుంచి వలస వచ్చిన వారితోనే భారత్ ఏర్పడింది: అసదుద్దీన్ ఒవైసీ
- భారత్ నాదీ, మోదీ–షాలదీ కాదంటూ వ్యాఖ్య
- ద్రవిడులు, ఆదివాసీలదని కామెంట్
- శరద్ పవార్ పై విరుచుకుపడిన మజ్లిస్ చీఫ్
భారత్ తనదీ, మోదీ–షాలదిగానీ, థాక్రేలదిగానీ కాదని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ దేశం ద్రవిడియన్లు, ఆదివాసీలదని ఆసక్తికర కామెంట్లు చేశారు. నిన్న మహారాష్ట్రలోని భివాండీలో జరిగిన ఓ సభలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)పై మండిపడ్డారు.
ఆఫ్రికా, మధ్య ఆసియా, ఇరాన్, తూర్పు ఆసియా నుంచి వలస వచ్చిన వారితోనే భారత్ ఏర్పడిందన్నారు. దేశంలోకి మొగలులు వచ్చాకే ఆర్ఎస్ఎస్–బీజేపీ వచ్చాయన్నారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పైనా ఆయన ఫైర్ అయ్యారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విషయంలో సీబీఐ, ఈడీలు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రధాని మోదీని కలిసినట్టే.. ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ విషయంలో కూడా ఎందుకు కలవలేదని నిలదీశారు. నవాబ్ మాలిక్ ముస్లిం అనే కలవలేదా? అని ప్రశ్నించారు.