పెరుగుతున్న యాక్టివ్ కేసులు.., దేశంలో కొత్తగా 2,828 కేసులు, 14 మంది మృతి
- దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 17,087
- కరోనా బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,035
- వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 13,81,764
దేశంలో కరోనా విస్తృతి స్థిరంగానే కొనసాగుతున్నా...క్రమేణా యాక్టివ్ కేసుల పెరుగుదల ఆందోళనను రేకెత్తిస్తోంది. గడచిన కొన్నాళ్లుగా 3 వేల లోపుగా కొత్త కేసులు నమోదవుతుండగా... శనివారం కూడా అదే స్థాయిలో కొత్త కేసులు నమోదైనా... యాక్టివ్ కేసుల సంఖ్య మాత్రం 17 వేలను దాటింది. కొత్త కేసుల కంటే కోలుకుంటున్న వారి సంఖ్య తక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 17,087 యాక్టివ్ కేసులున్నాయి.
ఇక శనివారం దేశంలో నమోదైన కేసులు, మరణాల విషయానికి వస్తే... శనివారం 4,74,309 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా... 2,828 మంది కరోనా పాజిటివ్‌గా తేలారు. గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా 14 మంది మరణించారు. దీంతో ఇప్పటిదాకా కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 5,24, 586కు చేరింది. ఇక కరోనా బారిన పడిన వారిలో శనివారం 2,035 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటిదాకా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.26 కోట్లను దాటింది. ఇదిలా ఉంటే.. శనివారం 13,81,764 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకోగా.. దేశంలో ఇప్పటిదాకా వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 193.28 కోట్లను దాటింది.