బాలకృష్ణను విమర్శించే స్థాయి అనుకుంటున్నారా?.. సాయిరెడ్డిపై గోరంట్ల ఫైర్!
- సాయిరెడ్డిని టార్గెట్ చేస్తూ 3 ట్వీట్లు సంధించిన గోరంట్ల
- అబ్బాయిని నమ్మిన బాబాయికి గొడ్డలి పోటు రుచి చూపించారంటూ వ్యంగ్యం
- సాయిరెడ్డి వల్ల రాష్ట్రానికి నయా పైసా ఉపయోగం లేదని వ్యాఖ్య
- సముద్రాన్ని మింగే స్థాయికి చేరారన్న గోరంట్ల
టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు తనయుడు, ఆ పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను విమర్శించే స్థాయి మీకు లేదంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా శనివారం గోరంట్ల వరుసగా 3 ట్వీట్లను సంధించారు. బాలకృష్ణ నేతృత్వంలో నడుస్తున్న బసవతారకం ఆసుపత్రికి వెళ్లి చూస్తే.. బాలకృష్ణ చేస్తున్న సేవ అర్థమవుతుందంటూ ఆయన సాయిరెడ్డికి సూచించారు.
సాయిరెడ్డి వల్ల రాష్ట్రానికి నయా పైసా ఉపయోగం లేదన్న గోరంట్ల.. రాష్ట్ర ప్రజలను నయవంచనకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడ్డు కసాయిని నమ్ముతుందన్నట్లు.. అబ్బాయిని నమ్మిన బాబాయికి గొడ్డలి పోటు రుచి చూపించిన దరిద్రపు చరిత్ర మీదంటూ గోరంట్ల ఘాటు వ్యాఖ్యలు చేశారు. సొంత కంపెనీ నుంచి గ్యాస్ లీక్ అయ్యి అంత మందిని పొట్టన పెట్టుకున్న సాయిరెడ్డి సిగ్గు శరం లేకుండా ఫొటో షూట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
చనిపోయిన వారికి రూ.1 కోటి నష్ట పరిహారం ఇస్తానని మోసపు మాటలు చెప్పి.. 12మంది ప్రాణాలు బలిగొనడమే కాకుండా 500 మందిని ఆసుపత్రి పాలు చేశారని గోరంట్ల మండిపడ్డారు. ఇంత జరిగినా సిగ్గు లేకుండా వైజాగ్ రన్, వైఎస్సార్ కప్ అంటూ నయవంచన చేస్తున్నారని విమర్శించారు. సాయిరెడ్డిని విశాఖ గజ దొంగగా అభివర్ణించిన గోరంట్ల.. చివరికి సముద్రాన్ని కూడా మింగే స్థితికి చేరారంటూ మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు.