రూ.2లకే భోజనం.. హిందూపురంలో ప్రారంభించిన బాలకృష్ణ భార్య
- హిందూపురంలో మొబైల్ క్యాంటీన్ ప్రారంభం
- టీడీపీ ఎన్నారై, బాలకృష్ణ అభిమానుల ఆర్థిక సాయంతో క్యాంటీన్
- శత జయంతి వేడుకలు ముగిసేదాకా ఏడాది పొడవునా పనిచేయనున్న క్యాంటీన్
టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకల సందర్భంగా ఎన్టీఆర్ తనయుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర హిందూపురంలో ఓ కీలక అడుగు వేశారు. శనివారం హిందూపురంలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు హాజరైన ఆమె పట్టణంలో రూ.2లకే నాణ్యమైన భోజనాన్ని అందించే మొబైల్ క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఆమె మొబైల్ క్యాంటీన్ అందించే భోజనాన్ని పంపిణీ చేశారు.
గతంలో సీఎంగా ఉన్న సమయంలో ఎన్టీఆర్ కిలో బియ్యాన్ని రూ.2లకే అందించిన సంగతి తెలిసిందే. ఈ పథకం స్ఫూర్తితోనే రూ.2లకే నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామని ఆమె తెలిపారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరిగే ఏడాది పొడవునా ప్రతి రోజు మధ్యాహ్నం రూ.2లకే భోజనాన్ని అందజేయనున్నట్లు ఆమె తెలిపారు. టీడీపీ ఎన్నారై విభాగం, బాలకృష్ణ అభిమానులు సంయుక్తంగా ఈ మొబైల్ క్యాంటీన్‌ను ప్రారంభించారని ఆమె తెలిపారు.