ఆప్ సంచలన నిర్ణయం!... ఇద్దరు పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రాజ్యసభ టికెట్లు!
- పంజాబ్ కోటాలో ఖాళీ కానున్న రెండు రాజ్యసభ సీట్లు
- రికార్డు విక్టరీ కొట్టిన ఆప్ ఖాతాలోనే ఆ రెండు సీట్లు
- రెంటినీ పద్మశ్రీ అవార్డీలకు కేటాయించిన ఆప్
- విక్రమ్ జిత్ సింగ్ సాహ్ని, బల్బీర్ సింగ్ సీచేవాల్‌కు టికెట్లు
దేశ రాజకీయాల్లో సరికొత్త సంచనాలకు శ్రీకారం చుడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పద్మశ్రీ అవార్డులు అందుకున్న ఇద్దరు ప్రముఖులను రాజ్యసభకు పంపుతూ ఆ పార్టీ శనివారం నిర్ణయం తీసుకుంది. పంజాబ్ కోటా నుంచి ఆప్‌కు దక్కనున్న రెండు రాజ్యసభ సీట్లకు తమ పార్టీ అభ్యర్థులను కాకుండా... అసలు రాజకీయాలతో సంబంధం లేని విద్యావంతులను ఎంపిక చేసింది. ఈ మేరకు శనివారం సాయంత్రం ఆప్ ఓ కీలక ప్రకటన చేసింది.
ఇటీవల పంజాబ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల కోటాలో ఖాళీ కానున్న రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పంజాబ్ కోటాలో ఖాళీ కానున్న సీట్లు ఆ రాష్ట్ర అసెంబ్లీలోని పార్టీ బలాబలాల మేరకు రెండు సీట్లూ ఆప్‌కే దక్కనున్నాయి. ఈ సీట్లను పంజాబీ సంస్కృతి పరిరక్షణ కోసం పాటు పడుతూ పద్మశ్రీ అవార్డు గెలుచుకున్న విక్రమ్ జిత్ సింగ్ సాహ్ని, పర్యావరణ పరిరక్షణకు పాటుపడి పద్మశ్రీ అవార్డు దక్కించుకున్న బల్బీర్ సింగ్ సీచేవాల్‌లకు కేటాయించింది.