చౌతాలాకు జైలు శిక్షను ప్రస్తావిస్తూ చంద్రబాబుపై సాయిరెడ్డి ట్వీట్
- ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చౌతాలాకు నాలుగేళ్ల జైలు
- చంద్రబాబుపైనా లక్ష్మీపార్వతి ఇలాంటి కేసే వేశారు
- 17 ఏళ్లుగా స్టేలతో ఆ కేసు విచారణను అడ్డుకుంటున్నారన్న సాయిరెడ్డి
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న కేసులో హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలాకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.50 లక్షల జరిమానా విధిస్తూ రెండు రోజుల క్రితం ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ కేసును కోట్ చేస్తూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి శనివారం ఓ ట్వీట్ వదిలారు.
కేవలం రూ.6 కోట్ల ఆస్తులకు లెక్కలు చూపని కారణంగానే చౌతాలాకు నాలుగేళ్ల జైలు శిక్ష పడిందని గుర్తు చేసిన సాయిరెడ్డి... ఇలాంటి ఆరోపణలతోనే చంద్రబాబుపై ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి 2005లో ఓ కేసు వేశారని తెలిపారు. అయితే ఈ కేసు విచారణను 17 ఏళ్లుగా స్టేలతో 'నిప్పు'నాయుడు అడ్డుకుంటున్నారంటూ విమర్శలు గుప్పించారు.