గుంటూరు ఎన్టీఆర్ బస్టాండ్ కూడలిలో అన్న క్యాంటీన్ ప్రారంభం
- నేడు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు
- టీడీపీ ఎన్నారై, బాలకృష్ణ అభిమానుల ఆర్థిక సాయం
- అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన నక్కా ఆనందబాబు, తెనాలి శ్రావణ్ కుమార్
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ వ్యాప్తంగా వెలసిన అన్న క్యాంటీన్లు వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత మూతపడిన సంగతి తెలిసిందే. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరిట పెట్టిన ఈ క్యాంటీన్లు వలం రూ.5కే భోజనం అందించాయి. తాజాగా అన్న క్యాంటీన్ పేరిట గుంటూరులో ఓ క్యాంటీన్ శనివారం ప్రారంభమైంది. టీడీపీ మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్‌లు ఈ క్యాంటీన్‌ను గుంటూరులోని ఎన్టీఆర్ బస్టాండ్ కూడలిలో ప్రారంభించారు.
టీడీపీ ఎన్నారై విభాగం, నందమూరి బాలకృష్ణ అభిమానులు అందించిన ఆర్థిక సాయంతో ఈ క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. గతంలో అన్న క్యాంటీన్‌లో మాదిరే ఈ క్యాంటీన్‌లోనూ రూ.5లకే భోజనాన్ని అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ క్యాంటీన్‌ను ప్రారంభించినట్లు వారు తెలిపారు.