డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ కుమారుడికి క్లీన్ చిట్ రావడంపై చిదంబరం స్పందన!
- ఆర్యన్ ను సాక్ష్యాధారాలు లేకుండానే అరెస్ట్ చేశారన్న చిదంబరం
- సాక్ష్యాలు లేకుండానే 25 రోజులు జైల్లో పెట్టడం దారుణమని వ్యాఖ్య
- వారు అనుభవించిన క్షోభకు ఎవరు బాధ్యత వహిస్తారంటూ నిలదీత
డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు ఎన్సీబీ క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం స్పందిస్తూ... సాక్ష్యాధారాలు లేకుండానే ఆర్యన్ ను అరెస్ట్ చేసి, 25 రోజులు జైల్లో ఎలా పెట్టారని ప్రశ్నించారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోవడం వల్లే కేసును ఉపసంహరించుకున్నామని ఎన్సీబీ చెప్పిందని... సాక్ష్యాలు లేకుండానే ఒక వ్యక్తిని అన్ని రోజులు జెల్లో పెట్టడం దారుణమని అన్నారు.
ఆర్యన్ ఖాన్, ఆయన కుటుంబం అనుభవించిన మానసిక వేదనకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. చాలా కేసుల్లో ముందస్తు అరెస్టులు చేస్తున్నారని... ఆ తర్వాత దర్యాప్తును ప్రారంభిస్తున్నారని... ఇది చట్టం ద్వారా ఏర్పాటైన విధానాన్ని పక్కదారి పట్టించడమేనని అన్నారు.