యూపీలో ప్రార్ధనా మందిరాల నుంచి తొలగించిన స్పీకర్లు స్కూళ్లు, కాలేజీలకు విరాళం
- ప్రభుత్వ ఆదేశాలతో లౌడ్ స్పీకర్ల తొలగింపు
- వాటిని విద్యాలయాలకు విరాళంగా ఇస్తున్న మతనేతలు
- ఫిలిబిత్ జిల్లాలో కనిపించిన దృశ్యం
ఉత్తరప్రదేశ్ లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ కఠిన నిబంధనలు తీసుకురావడంతో అవి మూగబోతున్నాయి. అనుమతుల్లేని వేలాది స్పీకర్లను అధికారులు తొలగించగా.. అనుమతి ఉన్నవి బయటకు వినిపించనంత తక్కువ సౌండ్ తో పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో ఫిలిబిత్ జిల్లాలో తొలగించిన లౌడ్ స్పీకర్లను మత నేతలు ప్రార్థనా స్థలాల తరఫున విద్యాలయాలకు విరాళంగా ఇస్తున్నారు.
జిల్లా ఎస్పీ దినేష్ కుమార్ ఆదేశాలతో పలు మతాలకు చెందిన వారు ప్రార్థనా స్థలాలపై (ఆలయాలు, మసీదులు, గురుద్వారాలు) లౌడ్ స్పీకర్లను స్వచ్చందంగా తొలగించారు. ఇప్పుడు అవే స్పీకర్లను ఫిలిబిత్ లోని విద్యా మందిర్ కాలేజీకి, జిల్లా వ్యాప్తంగా ఉన్న స్కూళ్లకు అందించే ఏర్పాటు చేశారు. ఈ చర్యను జిల్లా ఎస్పీ అభినందించారు. స్కూళ్లు, కాలేజీల్లో ఆగస్ట్ 15, జనవరి 26, వార్షికోత్సవ కార్యక్రమాలకు ఇవి ఉపయోగపడతాయన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టు ఎస్పీ ప్రకటించారు.