తన పొలంలో పండించిన బియ్యం గింజలతో చరణ్ బొమ్మ.. ఓ వీరాభిమాని ఆర్ట్.. ఇవిగో ఫొటోలు

  • 264 కిలోమీటర్లు నడిచెళ్లి ఇచ్చిన జైరాజ్ అనే వ్యక్తి
  • పొలంలో పండిన బియ్యమూ చరణ్ కు అందజేత 
  • ఆర్ట్ ను చూసి మురిసిపోయిన చరణ్
అభిమాన హీరో కోసం కొందరు జనాలు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. రామ్ చరణ్ విషయంలో అలాంటి ఆసక్తికర ఘటనే జరిగింది. తన పొలంలో పండించిన ధాన్యంతో రామ్ చరణ్ బొమ్మ గీశాడా వ్యక్తి. తెలంగాణలోని గద్వాల జిల్లా గోర్లఖాన్ దొడ్డికి చెందిన జైరాజ్ అనే వ్యక్తి.. రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని బియ్యపు గింజలతో ఇలా చాటుకున్నాడు. 

అంతేకాదు.. ఆ బొమ్మలను, తాను పండించిన బియ్యాన్ని ఇచ్చేందుకు 264 కిలోమీటర్లు నడిచి రామ్ చరణ్ ను చేరాడు. చరణ్ నివాసంలో ఆయన్ను కలిసి బియ్యపు గింజలతో తాను వేసిన బొమ్మ గురించి వివరించి చెప్పాడు. ఆ అభిమానాన్ని ఆర్ట్ ను చూసి చరణ్ మురిసిపోయాడు.


More Telugu News