సంక్షోభంలో స్టార్టప్ లు.. 8,000 ఉద్యోగాలు హుష్ కాకి!
- వ్యయ భారాన్ని మోయలేకున్న స్టార్టప్ లు
- తాజా నిధుల లభ్యత తగ్గిపోయిన పరిస్థితి
- దీంతో ఉద్యోగులను సాగనంపుతున్న సంస్థలు
- 2,100 మందిని తీసేసిన ఓలా
మంచి ఆఫర్లతో ఉద్యోగులను ఆకర్షించడంలో స్టార్టప్ లు పోటీ పడుతుంటాయి. గత రెండేళ్ల కాలం స్టార్టప్ లకు స్వర్గధామం అని చెప్పుకోవాలి. వేలాది స్టార్టప్ లు ప్రాణం పోసుకున్నాయి. అయితే, వీటిల్లో నిలిచి గెలిచేవి ఎన్నన్నది కాలమే చెప్పాలి. ఇప్పటి వరకు ఉద్యోగులను నియమించుకునే విషయంలో పోటీ పడిన స్టార్టప్ లు.. ఇప్పుడు వారిని తొలగించడంలో పోటీ పడుతున్నాయి.
మారిన ప్రపంచ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో, క్యాష్ బర్నింగ్ (వ్యాపార విస్తరణ కోసం ఖర్చు పెట్టడం)కు బదులు సహజసిద్ధంగా, నిదానంగా అడుగులు వేద్దామన్నది స్టార్టప్ ల అభిమతంగా కనిపిస్తోంది. భారీగా పెరిగిపోతున్న వ్యయాలు పెద్ద సమస్యగా పరిణమించాయి. దీంతో వ్యయాలు తగ్గించుకోవడంపై అవి దృష్టి సారిస్తున్నాయి.
ప్రముఖ స్టార్టప్ లు అయిన అన్ అకాడెమీ, కార్స్ 24, వేదాంతు, మీషో, ట్రెల్, ఫుర్లెంకో సహా ఇతర స్టార్టప్ లు అన్నీ కలసి 2022 జనవరి-మార్చి కాలంలో 8,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. వ్యయాలు తగ్గించుకునేందుకే ఉద్యోగులకు కోత పెడుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే మార్కెట్లలో తీవ్ర అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో స్టార్టప్ లకు నిధులు లభించడం కూడా కష్టంగా మారింది. అందుకే ఈ పరిస్థితి అని విశ్లేషకులు చెబుతున్నారు.
2022 మొదటి మూడు నెలల్లో ఓలా 2,100 మంది ఉద్యోగులను తీసి పడేసింది. అన్ అకాడెమీ 926 మందిని సాగనంపింది. వేదాంతు 600 మందిని, కార్స్ 24 600 చొప్పన ఉద్యోగులను తొలగించాయి. ఈ కామర్స్ వేదిక అయిన మీషో సైతం ఇదే బాటలో నడుస్తూ 150 మంది ఉద్యోగులకు వీడ్కోలు చెప్పింది. విద్యా సంబంధిత స్టార్టప్ అయిన వేదాంతులో 5900 మంది ఉద్యోగులు ఉండగా, సుమారు 7 శాతం మందిని కంపెనీ వీడి వెళ్లిపోవాలని కోరుతూ చేతిలో పింక్ స్లిప్ పెట్టింది.