ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా బాలకృష్ణ న్యూ మూవీ పోస్టర్ రిలీజ్!

ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా బాలకృష్ణ న్యూ మూవీ పోస్టర్ రిలీజ్!
  • సెట్స్ పై ఉన్న బాలయ్య 107వ సినిమా 
  • ఇంకా టైటిల్ ను ఖరారు చేయని మేకర్స్ 
  • కథానాయికగా అలరించనున్న శ్రుతి హాసన్ 
  • ఆకట్టుకుంటున్న బాలయ్య ఫస్టులుక్ పోస్టర్
ఎన్టీఆర్ కి ముందు చాలామంది నటులు తెలుగు తెరపై సందడి చేశారు. అయితే ఎన్టీఆర్ వచ్చిన తరువాతనే వెండితెర వైభవం మొదలైందని చెప్పచ్చు. నటుడిగా .. దర్శక నిర్మాతగా తెలుగు సినిమాలను ప్రభావితం చేసిన ఆయన. సమర్ధుడైన రాజకీయనాయకుడిగా రాజకీయాలను కూడా ప్రభావితం చేశారు.

అలాంటి ఎన్టీ రామారావు శత జయంతి నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బాలకృష్ణ 107వ సినిమా నుంచి  ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. చుట్టూ జనమంతా చూస్తుండగా శత్రు సంహారం చేస్తున్న వీరుడిలా ఈ పోస్టర్లో  బాలకృష్ణ కనిపిస్తున్నారు. మంచి ఫిట్ నెస్ తో ఆయన అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

 రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. తమన్  సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్ అలరించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'అఖండ' హిట్ తరువాత బాలయ్య .. ' క్రాక్' హిట్ తరువాత గోపీచంద్ మలినేని చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.


More Telugu News