రాణించిన పాటిదార్.. మిగతా బ్యాట్స్ మెన్ ఫెయిల్!
- ఐపీఎల్ లో రెండో క్వాలిఫయర్
- రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు
- టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు
- 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 రన్స్
- అర్ధసెంచరీ సాధించిన పాటిదార్
ఐపీఎల్ క్వాలిఫయర్-2లో బెంగళూరు ఆటగాడు రజత్ పాటిదార్ మరోసారి రాణించాడు. రాజస్థాన్ రాయల్స్ పై టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో సెంచరీ చేసి ఫామ్ నిరూపించుకున్న రజత్ పాటిదార్ ఈ మ్యాచ్ లో అర్థసెంచరీతో సత్తా చాటాడు. పాటిదార్ 42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 58 పరుగులు చేశాడు.
అయితే, మిగతా ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో బెంగళూరు భారీ స్కోరు ఆశలు నెరవేరలేదు. ఓపెనర్ గా వచ్చిన విరాట్ కోహ్లీ (7) మరోసారి విఫలం కాగా, కెప్టెన్ డుప్లెసిస్ 25, మ్యాక్స్ వెల్ 24 పరుగులు చేశారు. లోమ్రోర్ 8, దినేశ్ కార్తీక్ 6, షాబాజ్ అహ్మద్ 12 (నాటౌట్) పరుగులు చేశారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3, ఒబెద్ మెక్ కాయ్ 3, ట్రెంట్ బౌల్ట్ 1, రవిచంద్రన్ అశ్విన్ 1 వికెట్ తీశారు.