ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం సాధించాల్సిందే!... మహానాడులో టీడీపీ తీర్మానం
- ఒంగోలు కేంద్రంగా టీడీపీ మహానాడు
- తొలి రోజే రాజకీయ తీర్మానాలను ఆమోదించిన పార్టీ
- రాజకీయ శక్తుల కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తీర్మానం
తెలుగు దేశం పార్టీ (టీడీపీ) వార్షిక వేడుక మహానాడులో ఆ పార్టీ కీలక తీర్మానాలకు ఆమోదం తెలిపింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం సాధించాల్సిందేనని ఆ పార్టీ ఓ కీలక తీర్మానం చేసింది. అంతేకాకుండా వందేళ్లకు సరిపడ నాయకత్వాన్ని అందించేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని కూడా పార్టీ తీర్మానించింది. క్విట్ జగన్, సేవ్ ఏపీ పేరిట టీడీపీ రాజకీయ తీర్మానాన్ని ఆమోదించింది. 40 ఏళ్ల వేడుకలో మరోమారు పోరాటానికి కార్యోన్ముఖులం అవుదామని ఆ పార్టీ తీర్మానించింది. ఔ
రాజకీయ శక్తుల కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న తీర్మానానికి టీడీపీ ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టి.. ప్రజలను బాధల్లోకి నెట్టిన విధానాన్ని ప్రజలకు వివరించాలని తీర్మానించింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు చేపట్టాలని కూడా ఆ పార్టీ తీర్మానం చేసింది. పార్టీకి దూరమైన వారిని చేరువ చేసుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేయాలని తీర్మానించింది. పార్టీ బలోపేతానికి బలమైన వ్యూహాల రచన, వాటిని పకడ్బందీగా అమలు చేసేందుకు కూడా టీడీపీ నిర్ణయించింది.