మామిడి పండ్లను చక్కగా నిల్వ చేయడం ఎలాగంటే..!
- పూర్తి పక్వానికి వచ్చిన తర్వాత తింటే మంచి రుచి, ఆరోగ్యం
- పండకుండా తింటే అజీర్తి, విరేచనాలు
- కొంచెం పండిన వాటిని పేపర్ లో చుట్టి గదిలో ఉంచేయవచ్చు
- పండిన తర్వాత రిఫ్రిజిరేటర్ లోనూ పెట్టుకోవచ్చు
ఈ ఏడాది మార్కెట్ కు మామిడి పంట రావడం ఆలస్యంగా మొదలైంది. ఏప్రిల్ చివరి నుంచి కొద్ది కొద్దిగా వచ్చినప్పటికీ.. మే చివరికి వచ్చే సరికి పెద్ద మొత్తంలో మామిడి పండ్లు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. వీటిని కొనుగోలు చేస్తున్న వారు సరైన విధానంలో నిల్వ చేసుకోవడం ఎంతో ముఖ్యం. అప్పుడే అవి తాజాగా, రుచిగా ఉంటాయి. ఆరోగ్యాన్నిస్తాయి.
పక్వానికి వచ్చినప్పుడే..
మామిడి కాయలను తీసుకొచ్చి కొద్దిగా మగ్గించి, లేదంటే ఒకరోజు కెమికల్స్ మధ్య ఉంచి మార్కెట్లోకి తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. దీనివల్ల అవి పూర్తి స్థాయిలో పక్వానికి వచ్చి ఉండవు. కనుక మామిడి పండ్లు కొనుగోలు చేసేవారు వెంటనే తినాలని అనుకుంటే.. అవి పూర్తిగా పక్వానికి వచ్చాయా? రాలేదా? అన్నది నిర్ధారించుకోవాలి. పూర్తి పక్వానికి రాని పండ్లు పుల్లటి రుచితో ఉంటాయి. అజీర్తి, గ్యాస్ ట్రబుల్, నీళ్ల విరేచనాల సమస్యలు కూడా కనిపించొచ్చు. కనుక పండని వాటిని పూర్తి పక్వానికి వచ్చే వరకు వేచి చూడడం మంచిది. ఇక బాగా మగ్గిన మామిడి పండ్లు పుల్లటి రుచి లేదంటే చప్పగా మారిపోతాయి. కనుక మామిడి పండ్లను పక్వానికి వచ్చిన సమయంలోనే తినాలి.
పండినట్టు గుర్తించడం ఎలా?
ఒక మామిడి పండు పక్వానికి వచ్చినట్టు ఎలా తెలుసుకోవాలి..? పూర్తిగా పండిన పండు పసుపు లేదా ఆరెంజ్ కలర్ టోన్ తో ఉంటుంది. మధ్య మధ్యలో ఆకుపచ్చని లేయర్లు కనిపిస్తుంటే అది సరిగ్గా పండలేదని అర్థం చేసుకోవాలి.
నిల్వ చేసుకోవడం
పూర్తిగా పండని మామిడికాయలను గది వాతావరణంలోనే ఉంచేయాలి. దాంతో అవి మరింత పక్వానికి వస్తాయి. దాంతో పండులో తీపిదనం పెరుగుతుంది. కొంచెం తొందరగా పండాలనుకుంటే పేపర్ లో చుట్టి గది వాతావరణంలో ఉంచేయాలి.
రిఫ్రిజిరేటర్ లో పెట్టడం..
మామిడి కాయలు పక్వానికి వచ్చి, వాటిని అదే రోజు తినడం లేదని అనుకుంటే తీసుకెళ్లి ఫ్రిజ్ లో ఉంచొచ్చు. ఒక్కసారి ఫ్రిజ్ లోకి వెళితే మామిడి అంతకుమించి పక్వానికి రాదు. రిఫ్రిజిరేటర్ లో ఉంచితే ఐదు రోజుల వరకు తాజాగా ఉంటాయి. ఆ తర్వాత క్రమంగా రుచిని కోల్పోతాయి. కోసిన మామిడి పండు, ముక్కలను గాలిచొరబడని కంటెయినర్ లో పెట్టి ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు. వారం రోజుల వరకు ఏమీ కాదు.