నన్ను రెండు సార్లు ఎన్ కౌంటర్ చేసి చంపేందుకు యత్నించారు: చింతమనేని ప్రభాకర్ ఆరోపణలు
- వైసీపీ ప్రభుత్వం తనను చంపేందుకు ప్రయత్నిస్తోందన్న ప్రభాకర్
- 2019, 2021లో ఎన్ కౌంటర్ చేసేందుకు యత్నించారని ఆరోపణ
- టీడీపీ నాయకులు స్పందించకుంటే ఎప్పుడో చనిపోయేవాడినని వ్యాఖ్య
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అంతం చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. ఎన్ కౌంటర్ చేసి తనను చంపాలనుకుంటోందని అన్నారు. తనను హతం చేసేందుకు ఇప్పటికే రెండు సార్లు ప్రయత్నించారని చెప్పారు. 2019లో ఒకసారి, 2021లో మరోసారి ఎన్ కౌంటర్ చేసేందుకు యత్నించారని వెల్లడించారు.
అయితే, సకాలంలో టీడీపీ నాయకులు స్పందించకుంటే తాను ఎప్పుడో చనిపోయేవాడినని తెలిపారు. తన తరపున కేసులు వాదిస్తున్న లాయర్ కు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వార్నింగ్ ఇచ్చారని చెప్పారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు తనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు.