మోదీ ముందే తమిళ వాదం వినిపించిన సీఎం స్టాలిన్
- చెన్నై పర్యటనలో మోదీ
- తమిళనాడులో తమిళమే మాట్లాడతామన్న స్టాలిన్
- ద్రవిడ మోడల్ పాలనను దేశానికి చూపిస్తామని వెల్లడి
ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై పర్యటన సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మోదీ ముందే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తమిళ వాదాన్ని, ద్రవిడ వాదాన్ని వినిపించారు. తమిళనాడులో తమిళమే మాట్లాడతామంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ద్రవిడ మోడల్ పాలనను యావత్తు దేశానికి చూపిస్తామంటూ స్టాలిన్ మరింత ఆసక్తికర వ్యాఖ్య చేశారు.
అనంతరం కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాలను ప్రస్తావించిన స్టాలిన్.. రాష్ట్రాలకు నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనని తేల్చి చెప్పారు. రాష్ట్రాలతో కేంద్రం కలిసి పనిచేస్తేనే దేశాభివృద్ధి సాధ్యమని కూడా ఆయన తెలిపారు. తమిళనాడుకు కేంద్రం ఇవ్వాల్సిన జీఎస్టీ నిధులను తక్షణమే విడుదల చేయాలని కూడా సభా వేదికగానే మోదీని స్టాలిన్ కోరారు.