తెలంగాణ‌లో రూ.1,400 కోట్ల పెట్టుబ‌డిని ప్ర‌క‌టించిన హ్యుందాయ్‌

  • తెలంగాణ‌లో ఏర్పాటు కానున్న మొబిలిటీ క్ల‌స్ట‌ర్‌
  • క్ల‌స్ట‌ర్‌లో పెట్టుబ‌డి పెట్ట‌నున్న హ్యుందాయ్‌
  • దావోస్‌లో రాష్ట్ర ప్ర‌భుత్వంతో ఒప్పందం
తెలంగాణ‌కు మ‌రో భారీ పెట్టుబ‌డి రానుంది. తెలంగాణ‌లో రూ.1,400 కోట్ల పెట్టుబ‌డిని పెట్ట‌నున్న‌ట్లు ద‌క్షిణ కొరియా కార్ల కంపెనీ హ్యుందాయ్ ప్ర‌కటించింది. తెలంగాణ ప్ర‌భుత్వం నూత‌నంగా ఏర్పాటు చేయ‌నున్న మొబిలిటీ క్ల‌స్ట‌ర్‌లో ఈ పెట్టుబ‌డుల‌ను పెట్ట‌నున్న‌ట్లు ఆ సంస్థ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు దావోస్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ ఎకన‌మిక్ ఫోరం స‌ద‌స్సులో భాగంగా తెలంగాణ ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో హ్యుందాయ్ రాష్ట్ర ప్ర‌భుత్వంతో ఒప్పందంపై సంత‌కాలు చేసింది.


More Telugu News