లక్ష మంది సమక్షంలో ఆడనుండడం ఇదే మొదటిసారి: శుభ్ మన్ గిల్

  • అంత మంది చూస్తుండగా ఎప్పుడూ ఆడలేదన్న గుజరాత్ జట్టు ఓపెనర్
  • వాతావరణం తమకు అనుకూలమని వ్యాఖ్య
  • ఫైనల్స్ తమకు గొప్ప మ్యాచ్ అవుతుందన్న గిల్
రాజస్థాన్ రాయల్స్ ను ఓడించి గుజరాత్ టైటాన్స్ ఫైనల్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ నెల 29న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ మాట్లాడుతూ.. సొంత ఫ్యాన్స్ మధ్య ఫైనల్స్ ఆడనుండడం ఎంతో ఉత్సాహంగా ఉందన్నాడు. 

నరేంద్ర మోదీ స్టేడియం సామర్థ్యం లక్ష మంది. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ స్డేడియం మాదిరే ఇది కూడా పెద్దది. మన దేశంలో అత్యధిక ప్రేక్షకుల సామర్థ్యం ఉన్న స్డేడియం కూడా ఇదే కావడం గమనించాలి. ‘‘నాకు ఎంతో ఉద్విగ్నంగా ఉంది. లక్షమంది చూస్తుండగా నేను ఎప్పుడూ మ్యాచ్ ఆడలేదు. ఇది ఎంతో అద్భుతం. ఈ వాతావరణాన్ని మేము అనుకూలంగా మలుచుకుంటాం. మాకు అది గొప్ప గేమ్ అవుతుంది’’ అని గిల్ పేర్కొన్నాడు. 

కొత్త జట్టు అయినప్పటికీ గుజరాత్ టైటాన్స్ మిగిలిన అన్ని జట్లతో పోలిస్తే అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా ఉండడం గమనార్హం. గతంలో కెప్టెన్సీ అనుభవం లేకపోయినా, హార్ధిక్ పాండ్యా జట్టును నడపిస్తున్న తీరు చాలా గొప్పగా ఉందని అభిమానులు భావిస్తున్నారు.


More Telugu News