డిపాజిటర్ల సొమ్ముతో ఐపీఎల్ పై బెట్టింగ్.. పోస్ట్ మాస్టర్ అరెస్ట్
- డజన్ల సంఖ్యలో డిపాజిటర్ల సొమ్ము పక్కదారి
- నకిలీ ఎఫ్ డీ పత్రాలు ఇచ్చిన సబ్ పోస్ట్ మాస్టర్
- ఆ డబ్బుతో ఐపీఎల్ జట్లపై పందేలు
- రూ.కోటి నష్టంతో విషయం వెలుగులోకి
డిపాజిటర్ల సొమ్మును పక్కదారి పట్టించి, ఐపీఎల్ లపై భారీ పందేలు కట్టిన పోస్ట్ మాస్టర్ ఇప్పుడు జైలు ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి కొనితెచ్చుకున్నాడు. మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లా బినా సబ్ పోస్ట్ ఆఫీస్ కు విశాల్ అహిర్వార్ సబ్ పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు.
అహిర్వార్ కు ఐపీఎల్ లో పందేలపై పిచ్చిపట్టింది. లాటరీ గెలుచుకోకపోతానా అంటూ ఐపీఎల్ జట్లపై బెట్టింగ్ కట్టి రూ.కోటి పోగొట్టుకున్నాడు. ఇదంతా ఆయన కూడబెట్టింది అయితే సమస్య వచ్చేదే కాదు. రెండు డజన్ల కుటుంబాల పొదుపు సొమ్ముతో బెట్టింగ్ కు పాల్పడడం, నష్టపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. డిపాజిటర్లు జమ చేసిన సొమ్ముకు నకిలీ ఎఫ్ డీ పత్రాలు ఇచ్చి.. ఆ సొమ్మును తీసుకెళ్లి పందేలపై పెట్టేవాడని విచారణలో తెలిసింది.
గత రెండేళ్లుగా ఈ వ్యవహారం జరిగినట్టు పోలీసులు ప్రకటించారు. ఇప్పటికే రెండు సెక్షన్ల కింద అతడిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. విచారణ తర్వాత వెలుగు చూసిన సమాచారం ఆధారంగా అవసరమైతే మరిన్ని సెక్షన్ల కింద అభియోగాలు జోడించనున్నట్టు చెప్పారు.