దేశంలో నిన్న 2,124 కరోనా కేసుల నమోదు
- ముందు రోజుతో పోలిస్తే 130 అధికం
- 14,971కి చేరిన యాక్టివ్ కేసులు
- రికవరీ రేటు 98.75 శాతం
దేశంలో కరోనా యాక్టివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్న 2,124 మంది మహమ్మారి బారిన పడ్డారు. దీంతో అంతకుముందు రోజుతో పోలిస్తే యాక్టివ్ కేసులు 130 ఎక్కువయ్యాయి. మొత్తంగా ఇంకా 14,971 మంది కరోనా పాజిటివ్ గా ఉన్నారు. కాగా, మొత్తం కేసుల సంఖ్య 4,31,42,192కి పెరిగాయి.
అలాగే నిన్న 17 మంది కరోనాతో చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,24,507కి చేరింది. 4,26,02,714 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. నిన్న ఒక్కరోజు 1,977 మంది కోలుకున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 0.46 శాతం కాగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 0.49 శాతం నమోదైంది. ఇప్పటిదాకా 192.67 కోట్ల డోసుల వ్యాక్సిన్ ను వినియోగించారు.