బీహార్‌లో బోల్తాపడిన నిజామాబాద్ బస్సు.. ఒకరి మృతి.. కాశీయాత్రకు వెళ్తుండగా ఘటన
- కాశీయాత్రకు బయలుదేరిన నిర్మల్, నిజామాబాద్ భక్తులు
- ఔరంగాబాద్‌లో బస్సును ఢీకొన్న లారీ
- నిజామాబాద్ జిల్లా వెల్మడ్‌కు చెందిన వృద్ధురాలి మృతి
నిజామాబాద్ నుంచి కాశీకి వెళ్తున్న ఓ బస్సు బీహార్‌లో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఓ వృద్ధురాలు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. 38 మంది యాత్రికులతో నిన్న ఓ ట్రావెల్స్ బస్సు నిజామాబాద్ నుంచి కాశీయాత్రకు బయలుదేరింది. బీహార్‌లోని ఔరంగాబాద్‌కు చేరుకున్న తర్వాత ఓ హోటల్ వద్ద బస్సును ఆపేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో వెనక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టడంతో బోల్తా పడింది.
ఈ ఘటనలో నిజామాబాద్ జిల్లాలోని వెల్మడ్‌కు చెందిన 70 ఏళ్ల సరళమ్మ మృతి చెందింది. గాయపడిన ఐదుగురిని వెంటనే ఔరంగాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ బస్సులో నిజామాబాద్ జిల్లాలోని వెల్మల్, దత్తపూర్, తలవేద, డొంకేశ్వర్ గ్రామాలకు చెందిన వారితోపాటు నిర్మల్ జిల్లా బాసరకు చెందిన యాత్రికులు ఉన్నారు.