కోనసీమ అల్లర్లు టీడీపీ, జనసేన పనే: సంచలన వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి తానేటి వనిత
- కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు
- పెల్లుబికిన నిరసనలు
- వైసీపీ నేతల ఇళ్లకు నిప్పు
- పోలీసులపైనా దాడులు
- తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హోంమంత్రి
కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ నేడు అమలాపురంలో చేపట్టిన నిరసన హింసాత్మక రూపుదాల్చడం తెలిసిందే. ఆందోళనకారులు పోలీసులపైనా దాడులకు ప్రయత్నించడం, మంత్రి పినిపె విశ్వరూప్, వైసీపీ ఎమ్మెల్యే సతీష్ బాబు ఇళ్లకు నిప్పంటించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
కాగా, అమలాపురంలో ఉద్రిక్తతలపై ఏపీ హోంమంత్రి తానేటి వనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోనసీమ అల్లర్ల వెనుక టీడీపీ, జనసేన ఉన్నాయని ఆరోపించారు. హింసాత్మక ఘటనల్లో 20 మంది పోలీసులకు గాయాలయ్యాయని వెల్లడించారు. జిల్లాకు అంబేద్కర్ పేరును వ్యతిరేకించడం సబబు కాదని అన్నారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరిట నామకరణం చేసినందుకు గర్వించాలని తెలిపారు.