మరో ప్రయోగానికి రెడీ అవుతున్న సూర్య!
- కొత్తదనం కోసం తపించే సూర్య
- రన్నింగ్ లో ఉన్న బాలా సినిమా షూటింగ్
- శివ దర్శకత్వంలో నెక్స్ట్ ప్రాజెక్టు
- మరోసారి ద్విపాత్రాభినయం చేయనున్న సూర్య
కోలీవుడ్లో కొత్తదనం కోసం తపించే కథానాయకులలో కమల్ .. విక్రమ్ తరువాత స్థానంలో సూర్య కనిపిస్తాడు. ప్రయోగాత్మక పాత్రలను చేయడానికి సూర్య ఎంతమాత్రం వెనుకాడడు. 'సెవెంత్ సెన్స్' .. 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' .. '24' వంటి సినిమాలు ఆ జాబితాలో కనిపిస్తాయి. ఆయన నటనలో వైవిధ్యానికి అద్దం పడతాయి.
సినిమా కూడా విభిన్నమైనదే. ఆ తరువాత వెట్రిమారన్ ను ఆయన లైన్లో పెట్టేశాడు. ఈ సినిమాతో పాటే ఆయన శివ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు చెబుతున్నారు. శివకి మాస్ డైరెక్టర్ గా మంచి క్రేజ్ ఉంది. అజిత్ కి వరుస హిట్లు ఇచ్చిన రికార్డు ఆయన ఖాతాలో ఉంది. ఆయన వినిపించిన కథ సూర్యకి బాగా నచ్చిందట.
చారిత్రక నేపథ్యంలో నడిచే ఈ కథలో సూర్య ద్విపాత్రాభినయం చేయనున్నాడట. రెండు పాత్రలలో వేరియేషన్ ఒక రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. ఒక పాత్ర కోసం సూర్య వర్క్ షాప్ లో కూడా పాల్గొనడం జరిగిందని అంటున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.