ఒప్పో నుంచి నాజూకైన ట్యాబ్

  • ఒప్పో ప్యాడ్ ఎయిర్ పేరుతో చైనాలో ఆవిష్కరణ
  • త్వరలో భారత మార్కెట్లోకి విడుదల
  • తక్కువ బరువుతో, స్లిమ్ గా ఉన్న ట్యాబ్
  • రూ.15,000 నుంచి ధరలు ప్రారంభం
ఒప్పో తాజాగా ఒక ట్యాబ్లెట్ ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. ఇది త్వరలోనే భారత్ మార్కెట్ కు కూడా రానుంది. ఒప్పో ప్యాడ్ ఎయిర్ పేరుతో తీసుకొచ్చిన ఈ ట్యాబ్లెట్.. ఒప్పో ప్యాడ్ కు లైటర్ వెర్షన్. బరువు కేవలం 440 గ్రాములే. అతి తక్కువ బరువుతో కూడిన ట్యాబ్ లలో ఇది కూడా ఒకటి. అంతేకాదు 6.94ఎంఎంతో అతి పలుచగా ఈ ట్యాబ్ ఉంటుంది. 

ఇందులో స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్ ఉంటుంది. ఇది మోసర్తు వేగంతో కూడిన, నమ్మకమైన ప్రాసెసర్. 10.36 అంగుళాల ఎల్సీడీ స్క్రీన్ (2కే డిస్ ప్లే), 60హెర్జ్ రీఫ్రెష్ రేటుతో ఉంటుంది. బ్రైట్ నెస్ 360 నిట్స్ గా ఉంది. 7,100 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. 

ఆండ్రాయిడ్ 12 ఆధారంగా కలర్ ఓఎస్ తో పనిచేస్తుంది. నాలుగు స్పీకర్లతో డాల్బీ ఆటమ్స్ సౌండ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ముందు భాగంలో 5 మెగా పిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు. స్టైలస్, కీబోర్డ్ కి సపోర్ట్ చేస్తుంది. విద్యార్థులకు ఇది అనుకూలం. 6జీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ ధర రూ.15,000. మరో రెండు వెర్షన్ల ధరలు రూ.19,800 వరకు ఉన్నాయి.


More Telugu News