మామిడి పండ్లు మితం దాటితే అనర్థాలే!
- అధికంగా తీసుకుంటే పలు దుష్ప్రభావాలు
- రక్తంలో గ్లూకోజ్ పెరిగిపోతుంది
- చర్మంపై దద్దుర్లు, నీళ్ల విరేచనాలు రావచ్చు
- ఒక పండుకు పరిమితం అయితే మంచిదే
ఇది మామిడి పండ్ల సీజన్. పండ్లలో మామిడిని రారాజుగానే చెబుతారు. మామిడి రుచి నచ్చని వారు బహుశా చాలా అరుదనే చెప్పుకోవాలి. ఈ నాలుగు రోజుల తర్వాత మళ్లీ మామిడి కనిపించదంటూ ఎక్కువ తినేసే వారు కూడా ఉంటారు. కానీ, మామిడి విషయంలో ‘అతి అనర్థదాయకం’ అనే సామెత అతుకుతుంది.
మామిడిలో విటమిన్ ఏ, బీ, సీ, ఈ, కే తోపాటు మినరల్స్ కాపర్, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. అంతేకాదు పేగులకు అవసరమైన పీచు కూడా మామిడి పండ్లలో ఉంటుంది. ఇది పేగుల్లో తిష్ట వేసిన మంచి బ్యాక్టీరియాకు అవసరం. కానీ పరిమితికి మించి తింటే దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మామిడి పడని వారికి ఒక్క పండుతో అయినా ఈ అనుభవాలు ఎదురుకావచ్చు.
అలర్జీ
మామిడిలో ఉండే ప్రొటీన్లు కొందరికి పడకపోవచ్చు. చర్మంపై దురదలు, దద్దుర్లు, గొంతులో వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కనిపిస్తే మామిడి పండ్లను తినడం ఆపేయాలి.
రక్తంలో గ్లూకోజు పెరుగుతుంది
మధుమేహం ఉన్న వారు రక్తంలో గ్లూకోజు పరిమితి దాటిపోకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అందుకని మధుమేహ సమస్యను ఎదుర్కొనేవారు రోజులో ఒక పండుకు మించి తినకుండా ఉండడమే మంచిది. ఇందులో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండడం, చక్కెరలు కూడా ఉండడం వల్ల ఎక్కువ తింటే రక్తంలో గ్లూకోజు గణనీయంగా పెరుగుతుంది.
డయేరియా
మామిడి పండ్లను ఎక్కువగా తిన్నప్పుడు సాధారణ రోజులతో పోలిస్తే ఒకటి రెండు సార్లు అదనంగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వచ్చిందంటే.. కచ్చితంగా అది మామిడి దోషమే అని భావించాలి. అంతేకాదు కొందరు ఒక పండు తిన్నా నీళ్ల విరేచనాలు అవుతాయి. అటువంటి వారు తినకుండా ఉండాలి.
బరువు
ఒకటికి మించి మామిడి పండ్లను తింటే బరువు కూడా పెరగొచ్చు. ఒక మామిడి పండుతో సుమారు 201 కేలరీలు వస్తాయి.
కృత్రిమంగా పండించినవి
మామిడి పండ్లను ఇప్పుడు హానికారక రసాయనాలతో మగ్గించి విక్రయిస్తున్నారు. వీటిని తినడం వల్ల కూడా కొందరిలో అలెర్జీలు, ఇతర దుష్ప్రభావాలు కనిపిస్తాయి. ఒక బకెట్ లో నీటిని పోసి మామిడి పండును అందులో వేయండి. మునిగిపోతే అది సహజ సిద్ధంగా పండినట్టు. పైన తేలితే అది కృత్రిమంగా పండించినట్టు అర్థం.