12 రోజుల క్రితం అదృశ్యమై విగతజీవిగా కనిపించిన హర్యాన్వీ గాయని
- ఈ నెల 11న అదృశ్యమైన గాయని
- మ్యూజిక్ వీడియో కోసం ఢిల్లీ నుంచి రోహ్‌తక్ తీసుకెళ్లిన నిందితులు
- శనివారం ఆమె ఫోన్ ఆన్ కావడంతో ట్రేస్ చేసిన పోలీసులు
- ఓ ఫ్లైఓవర్ కింద గాయని మృతదేహాన్ని పాతిపెట్టిన నిందితులు
ఈ నెల 11న అదృశ్యమైన ఢిల్లీకి చెందిన హర్యాన్వీ గాయని ఘటన విషాదాంతమైంది. రెండువారాల తర్వాత తాజాగా హర్యానాలోని రోహ్‌తక్ జిల్లాలో ఓ వంతెన కింద పాతిపెట్టిన ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై కిడ్నాప్, హత్యకేసు నమోదు చేశారు.
ఓ మ్యూజిక్ వీడియో షూటింగ్ నిమిత్తం ఈ నెల మొదట్లో యువ గాయనిని ఇద్దరు వ్యక్తులు ఢిల్లీ నుంచి రోహ్‌తక్ తీసుకెళ్లారు. కుమార్తె వెళ్లి చాలా రోజులు అయినా ఆమె నుంచి ఫోన్ రాకపోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉండడంతో అనుమానించిన కుటుంబ సభ్యులు ఈ నెల 14న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు శనివారం ఆమె ఫోన్ స్విచ్చాన్ కావడంతో వెంటనే ట్రేస్ చేశారు. ఆ ఫోన్‌ను ఆన్ చేసిన వ్యక్తిని రవిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు, భైరోన్ భైనీ గ్రామ సమీపంలోని ఫ్లైవర్ ఓవర్ దగ్గర ఓ మృతదేహాన్ని పాతిపెట్టినట్టు సమాచారం అందుకున్న పోలీసులు వెలికి తీసి పోస్టుమార్టం కోసం తరలించారు. అది తమ కుమార్తెదేనని ఆ తర్వాత గాయని కుటుంబ సభ్యులు గుర్తించారు. విచారణ సందర్భంగా ఆమెను తానే హత్య చేసినట్టు నిందితుడు రవి అంగీకరించాడు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.