దేశంలో మరిన్ని తగ్గిన కరోనాకేసులు ...అప్డేట్స్ ఇవిగో!
- గత 24 గంటల్లో 1,675 కేసుల నమోదు
- ఇదే సమయంలో 31 మంది మృతి
- 15 వేల దిగువకు వచ్చిన యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,675 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 1,635 మంది కరోనా నుంచి కోలుకోగా... 31 మంది వైరస్ బారిన పడి కన్నుమూశారు. క్రితం రోజు కంటే 400 మేర కేసులు తగ్గడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో 14,841 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశంలో నమోదైన కేసుల సంఖ్య 4,31,40,168కి చేరుకుంది. వీరిలో 4,26,00,737 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 5,24,490 మంది మహమ్మారికి బలయ్యారు. దేశంలో ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. క్రియాశీల రేటు 0.03 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటి వరకు 1,92,52,70,955 డోసుల కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేశారు. నిన్న ఒక్క రోజే 13.76 లక్షల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.