దావోస్‌లో ఆకట్టుకుంటున్న తెలంగాణ పెవిలియన్!... వీడియో ఇదిగో!
- దావోస్‌లో తెలంగాణ బృందానికి కేటీఆర్ నేతృత్వం
- తెలంగాణ పెవిలియన్ గ్లింప్సెస్ పేరిట వీడియో విడుదల
- ఫస్ట్ స్టాప్ తెలంగాణ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రపంచ వాణిజ్య విపణిలో సరికొత్త ప్రణాళికలు, సరికొత్త ప్రారంభాలకు నెలవుగా మారిన దావోస్ సదస్సులో తెలంగాణ సర్కారు ఏర్పాటు చేసిన పెవిలియన్ ఆకట్టుకుంటోంది. ఇండియా వెల్‌కమ్స్ ద వలర్డ్... ఫస్ట్ స్టాప్ తెలంగాణ అన్న నినాదంతో ఈ పెవిలియన్‌ను రూపొందించారు.
తెలంగాణ పారిశ్రామిక విధానం విస్పష్టంగా కనిపించేలా రూపొందించిన ఈ పెవిలియన్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు. ఈ మేరకు కాసేపటి క్రితం దావోస్ సదస్సులో తెలంగాణ పెవిలియన్ గ్లింప్సెస్ పేరిట మంత్రి కేటీఆర్ కార్యాలయం ఓ వీడియోతో పాటు పలు ఫొటోలను విడుదల చేసింది.
దావోస్ సదస్సుకు హాజరైన తెలంగాణ బృందానికి మంత్రి కేటీఆర్ నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. 29 సెకన్ల నిడివి ఉన్న గ్లింప్సెస్ వీడియోలో కేటీఆర్ కూడా కనిపిస్తున్నారు. ఇన్వెస్ట్ తెలంగాణ అంటూ సాగే ఈ వీడియోలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన తెలంగాణ పెవిలియన్ ముఖద్వారం, ఆయా కంపెనీల ప్రతినిధులతో భేటీల కోసం చేసిన ఏర్పాట్లను పొందుపరిచారు.