రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు ప్రయాణిస్తున్న విమానంలో పొగమంచు.. ఆందోళనకు గురైన ఆటగాళ్లు!

  • ముంబై నుంచి కోల్ కతాకు బయల్దేరిన ఆర్ఆర్ టీమ్
  • మేఘాల్లోకి వెళ్లడంతో విమానంలోకి వచ్చిన పొగమంచు
  • కాసేపటి తర్వాత క్లియిర్ అయిన పొగమంచు
ఐపీఎల్ టోర్నీ కీలక దశకు చేరుకుంది. క్వాలిఫయర్స్ జరుగుతున్నాయి. తమ తొలి క్వాలిఫయర్ మ్యాచ్ ఆడేందుకు ముంబై నుంచి కోల్ కతాకు బయల్దేరిన రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లకు ఊహించని పరిణామం ఎదురయింది. విమానం గాల్లో ఉన్న సమయంలో దట్టమైన పొగమంచు విమానంలోకి వచ్చింది. 

దీంతో, విమానంలో ఉన్న ఆటగాళ్లు కాసేపు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఏదో జరగబోతోందని భయపడ్డారు. కొందరు ఆటగాళ్లు భయంతో కేకలు కూడా వేశారు. విమానాన్ని ల్యాండింగ్ చేయాలని ఒక వ్యక్తి అరిచాడు. అయితే కాసేపటి తర్వాత పొగమంచు క్లియర్ కావడంతో అందరూ ఊపరి పీల్చుకున్నారు. ఆ తర్వాత విమానం కోల్ కతాలో సురక్షితంగా ల్యాండ్ అయింది.  

కొన్ని రోజులుగా కోల్ కతా ప్రాంతంలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో మేఘాల్లో నుంచి విమానం దూసుకుపోవడంతో విమానంలోకి పొగమంచు చేరింది. దీనికి సంబంధించిన వీడియోను రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.


More Telugu News