తైవాన్ అంశంలో ప్రమాదంతో చెలగాటమాడుతున్నారన్న బైడెన్... దేశ ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగిస్తామన్న చైనా
- క్వాడ్ సమావేశం కోసం జపాన్ వచ్చిన బైడెన్
- తైవాన్ కు మద్దతుగా అమెరికా వ్యాఖ్యలు
- చైనా దాడి చేస్తే తైవాన్ ను కాపాడతామని భరోసా
- మండిపడిన చైనా
- ఎవరినీ లెక్కచేయబోమని వార్నింగ్
తైవాన్ అంశంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో మరోసారి అగ్గి రాజుకుంది. చైనా దురాక్రమణ నుంచి తైవాన్ ను రక్షించేందుకు తాము కట్టుబడి ఉన్నామని బైడెన్ స్పష్టం చేశారు. క్వాడ్ దేశాల సమావేశం కోసం జపాన్ వచ్చిన బైడెన్ మాట్లాడుతూ, పదేపదే కవ్వింపులకు పాల్పడడం ద్వారా తైవాన్ విషయంలో చైనా ప్రమాదంతో చెలగాటమాడుతోందని ఆయన హెచ్చరించారు. చైనా ఎలాంటి సైనిక చర్యకు దిగినా, తైవాన్ కు తాము అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.
బైడెన్ వ్యాఖ్యలతో చైనా మండిపడింది. తైవాన్ విషయంలో దేశ ప్రయోజనాల కోసం దేనికైనా సిద్ధమేనని చైనా అధినాయకత్వం దీటుగా బదులిచ్చింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ స్పందిస్తూ, చైనా భూభాగంలో తైవాన్ విడదీయరాని భాగం అని స్పష్టం చేశారు. తైవాన్ అంశం పూర్తిగా చైనా అంతర్గత వ్యవహారం అని ఉద్ఘాటించారు.
చైనా సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత వంటి అంశాల జోలికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేదని లేదని, రాజీపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. చైనా దృఢ సంకల్పాన్ని, దేశ సర్వసత్తాక ప్రయోజనాల దిశగా చైనా ప్రజల బలీయమైన సామర్థ్యాలను ఎవరూ తక్కువ అంచనా వేయరాదని వెన్ బిన్ స్పష్టం చేశారు.