టీడీపీ హయాంలో ఏపీకి 39,450 పరిశ్రమలు.. వాటి ద్వారా 5,13,351 ఉద్యోగాలు: అయ్యన్నపాత్రుడు
- దావోస్ ఎందుకు డబ్బు దండగ అన్నారుగా? అంటూ ఎద్దేవా
- మరి ఏ ముఖం పెట్టుకుని జగన్ దావోస్ వెళ్లారని ప్రశ్న
- టీడీపీ హాయాంలో వచ్చిన కంపెనీలు, ఉద్యోగాల లెక్కలను వైసీపీ ప్రభుత్వమే అసెంబ్లీలో వెల్లడించిందన్న అయ్యన్న
- వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి అయ్యన్న ఘాటు కౌంటర్
స్విట్జర్లాండులోని దావోస్‌లో ఆదివారం ప్రారంభమైన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరైన సంగతి తెలిసిందే. ఈ పర్యటనపై టీడీపీ నేతలు వరుసగా విమర్శలు గుప్పిస్తున్న విషయమూ విదితమే. ఇందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఓ ట్వీట్ సంధించారు. వైసీపీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డిని కోట్ చేస్తూ సాగిన ఆ ట్వీట్‌లో టీడీపీ హయాంలో ఏపీకి వచ్చిన పరిశ్రమలెన్ని? వాటి ద్వారా రాష్ట్ర యువతకు అందిన ఉద్యోగాలెన్ని? అన్న వివరాలను అయ్యన్న వెల్లడించారు.
చంద్రబాబు గారు, లోకేశ్ దావోస్ పర్యటనలకు ఎంత ఖర్చు అయ్యిందో ఓపికగా లెక్కేసుకోవాలంటూ సాయిరెడ్డికి సూచించిన అయ్యన్న... అందుకు అవసరమయ్యే కాలిక్యులేటర్ ఫ్రీగా పంపుతానంటూ సెటైర్ సంధించారు. టీడీపీ హయాంలో వచ్చిన పెట్టుబడులు, కంపెనీలు, ఉద్యోగాల వివరాలు వైసీపీ ప్రభుత్వమే బయట పెట్టిందన్న అయ్యన్న.. బహుశా విశాఖ భూకబ్జా పనుల్లో బిజీగా ఉండి మీరు చూడలేదనుకుంటానని ఎద్దేవా చేశారు.
భారీ, మధ్య, చిన్న తరహా అన్నీ కలిపి రాష్ట్రానికి 39,450 పరిశ్రమలు వచ్చాయన్న అయ్యన్న... వాటి ద్వారా 5,13,351 ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా వైసీపీ ప్రభుత్వమే ఈ వివరాలను ప్రకటించిందని అయ్యన్న గుర్తు చేశారు. దావోస్ ఎందుకు దండగ అన్న జగన్ ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని దావోస్ వెళ్ళారని ప్రశ్నించిన అయ్యన్న.. సదస్సు ప్రారంభం కాకముందే ఫ్యామిలీతో లండన్ టూర్ కి ప్రత్యేక విమానంలో వెళ్ళిన సంగతీ తేల్చాలని డిమాండ్ చేశారు. తమ సంగతి మీరు మూడేళ్ల నుంచి తేలుస్తూనే ఉన్నారని ఎద్దేవా చేసిన అయ్యన్న ఏం పీకారో జనాలు కూడా చూశారంటూ సెటైర్ సంధించారు.