వృద్ధులకు రాయితీ ఎత్తేయడంతో రైల్వేకు కళ్లు చెదిరే ఆదాయం
- 2020 మార్చి నుంచి రెండేళ్లలో రూ.1,500 కోట్లు
- సమాచార హక్కు దరఖాస్తుకు రైల్వే శాఖ బదులు
- రాయితీల రూపంలో రైల్వేకు ఏటా రూ.2,000 కోట్ల నష్టం
వృద్ధులకు రైలు టికెట్లలో రాయితీ ఇక చూసే అవకాశం లేకపోవచ్చు. కరోనా వచ్చిన తర్వాత రైలు ప్రయాణాలపై అన్నిరకాల రాయితీలను నిలిపివేయడం తెలిసిందే. అంతా ఇది తాత్కాలికమే అని అనుకున్నారు. కానీ, ఇలా రాయితీలు ఎత్తేయడం వల్ల వచ్చిన భారీ ఆదాయం చూసి రైల్వే శాఖ పునరాలోచనలో పడిపోయింది.
2020 మార్చి నుంచి రెండేళ్లలో వృద్ధులకు రాయితీ తీసేయడం వల్ల రైల్వే శాఖకు అదనంగా రూ.1,500 కోట్ల ఆదాయం సమకూరింది. సమాచార హక్కు చట్టం కింద దాఖలైన ఒక దరఖాస్తుకు రైల్వే శాఖ వెల్లడించిన సమాచారమే ఈ విషయాన్ని తెలియజేస్తోంది. మధ్యప్రదేశ్ కు చెందిన చంద్రశేఖర్ గౌర్ ఈ సమాచారాన్ని తీసుకున్నారు.
2020 మార్చి నుంచి 2022 మార్చి 31 వరకు 7.31 కోట్ల వృద్ధులకు రాయితీలను ఇవ్వలేదని రైల్వే శాఖ తెలిపింది. ఇందులో 60 ఏళ్లు నిండిన మగవారు 4.46 కోట్లు కాగా, 58 ఏళ్లు నిండిన స్త్రీలు రూ.2.84 కోట్ల మంది ఉన్నారు. 60 ఏళ్లు నిండిన మగవారు, 58 ఏళ్లు నిండిన స్త్రీలకు టికెట్లలో 50 శాతం రాయితీ గతంలో ఉండేది. మరి ఇంత ఆదాయన్ని రైల్వే మళ్లీ కోల్పోవడానికి సిద్ధపడుతుందా? చూడాలి. 53 రకాల రాయితీల రూపంలో రైల్వే ఏటా రూ.2,000 కోట్ల ఆదాయాన్ని నష్టపోతోంది.