దావోస్ లో ఈరోజు జగన్ షెడ్యూల్ ఇదే!
- పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడమే లక్ష్యంగా జగన్ దావోస్ పర్యటన
- ఈరోజు కూడా పలువురు వ్యాపారవేత్తలు, సీఈవోలతో భేటీ కానున్న సీఎం
- సదస్సులో ఈరోజు ఫ్యూచర్ ప్రూఫింగ్ హెల్త్ సిస్టమ్స్ పై మాట్లాడనున్న జగన్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ దావోస్ లో బిజీగా గడుపుతున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు జగన్ అక్కడకు వెళ్లిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా ఆయన అక్కడ భేటీలు నిర్వహిస్తున్నారు. తన పర్యటనలో రెండో రోజైన ఈరోజు కూడా ఆయన పలువురు పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల సీఈవోలతో సమావేశం కానున్నారు.
ఫ్యూచర్ ప్రూఫింగ్ హెల్త్ సిస్టమ్స్ అంశంపై సదస్సులో ఈరోజు ఆయన మాట్లాడనున్నారు. స్విట్జర్లాండ్ కాలమానం ప్రకారం ఉదయం 8.15 గంటలకు సెషన్ ప్రారంభంకానుంది. అనంతరం టెక్ మహీంద్రా ఛైర్మన్, సీఈవో సీపీ గురానీతో భేటీకానున్నారు. ఆ తర్వాత దస్సాల్ట్ సీఈవో బెర్నార్డ్ ఛార్లెస్ తో సమావేశమవుతారు. అనంతరం ప్రముఖ రవాణా సంస్థ మిట్సుయి ఓఎస్కే లైన్స్ లిమిటెడ్ సీఈవో తకేషి హషిమొటోతో భేలీ అవుతారు.
అలాగే, హీరో మోటార్ కార్పొరేషన్ సీఎండీ పవన్ ముంజాల్ తో జగన్ సమావేశమవుతారు. అనంతరం ఐబీఎం ఛైర్మన్, సీఈవో అరవింద్ కృష్ణను కలవబోతున్నారు. తొలిరోజు విషయానికి వస్తే డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాజ్ ష్వాప్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.