అది ఫేక్ మెసేజ్... ఎస్ బీఐ ఖాతాదారులను హెచ్చరించిన కేంద్రం

  • మీ ఖాతా బ్లాక్ అయిందంటూ మెసేజ్
  • కీలక వివరాలతో అప్ డేట్ చేయించుకోవాలని సందేశం
  • మోసపూరిత సందేశం అని కేంద్రం వెల్లడి
  • ఖాతా వివరాలు పంచుకోవద్దని స్పష్టీకరణ
ఇటీవల ఫోన్లకు ఓ సందేశం వస్తోంది. మీ ఎస్ బీఐ ఖాతా బ్లాక్ చేయబడింది... సంబంధిత వివరాలతో మళ్లీ మీ ఖాతాను పునరుద్ధరించుకోండి అన్నది ఆ మెసేజ్ సారాంశం. ఆ మెసేజ్ తో పాటే ఓ లింకు కూడా దర్శనమిస్తోంది. అయితే ఇది ఫేక్ మెసేజ్ అని, దీంతో జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం ఇది నకిలీ మెసేజ్ అని స్పష్టం చేసింది. 

ఎస్ బీఐ తన ఖాతాదారులకు ఎప్పుడూ ఇలాంటి సందేశాలు పంపదని, ఒకవేళ మీ ఫోన్లకు, మెయిల్ కు ఈ తరహా సందేశాలు వస్తే అప్రమత్తతో వ్యవహరించాలని సూచించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంకు ఖాతా వివరాలను పంచుకోవద్దని హెచ్చరించింది. ఈ ఫేక్ మెసేజ్ పై ఎవరైనా ఎస్ బీఐ దృష్టికి తీసుకెళ్లాలనుకుంటే report.phishing@sbi.co.in కు మెయిల్ చేయాలని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం పేర్కొంది.


More Telugu News