డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్యను ఫోన్ లో పరామర్శించిన చంద్రబాబు

  • ఎమ్మెల్సీ కారులో శవమై తేలిన మాజీ డ్రైవర్
  • పోస్టుమార్టం పూర్తి
  • స్వగ్రామంలో అంత్యక్రియలు
  • టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారులో మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం శవమై కనిపించడం తీవ్ర కలకలం రేపింది. సుబ్రహ్మణ్యం మృతదేహానికి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం నేడు స్వగ్రామం గొల్లలమామిడాడలో అంత్యక్రియలు నిర్వహించారు. 

కాగా, డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్య అపర్ణను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఫోన్ ద్వారా పరామర్శించారు. అపర్ణకు టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితులకు శిక్ష పడేవరకు టీడీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. బహిరంగంగా తిరుగుతున్న ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 

అనంతబాబు సీఎం జగన్ కు బినామీ: హర్షకుమార్

డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతిపై మాజీ ఎంపీ హర్షకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ కు అనంతబాబు బినామీ అని అన్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. గంజాయి నుంచి మైనింగ్ వరకు అనంతబాబు అనేక అక్రమాలు చేస్తున్నాడని హర్షకుమార్ ఆరోపించారు. విలువైన రూబీ రాళ్లను కూడా ఎగుమతి చేశాడని వివరించారు. ఈ రూబీ రాళ్ల రహస్యాలు అనంతబాబు డ్రైవర్ కు తెలుసని, అక్రమాలు బయటపడతాయనే అతడ్ని హత్య చేశాడని పేర్కొన్నారు.


More Telugu News