కిటికీలు, తలుపులను ప్లాస్టిక్ తో మూసి.. గ్యాస్ లీక్ చేసి.. అగ్గి వెలిగించొద్దని నోట్ రాసి.. తల్లీకూతుళ్ల ఆత్మహత్య
- ఢిల్లీలోని వసంత విహార్ లో దారుణం
- స్థానికుల సమాచారంతో అక్కడకెళ్లిన పోలీసులు
- డోర్లు పగులగొట్టి లోపలికెళ్లిన వైనం
ఓ తల్లి.. ఇద్దరు కూతుళ్లు.. అత్యంత దారుణంగా ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటి తలుపులు, కిటికీలు మూసేసి.. బయటి గాలిలోపలికి.. లోపలి గాలి బయటకు వెళ్లనంతగా ప్లాస్టిక్ కవర్లతో సీల్ చేసి.. గ్యాస్ ను లీక్ చేసుకుని పీల్చి ప్రాణాలు తీసుకున్నారు. అంతేకాదు.. తెల్లారి ఎవరైనా డోర్లు తీస్తే వారికి ఏం కాకూడదన్న ఉద్దేశంతో ‘గ్యాస్ లీక్.. అగ్గి వెలిగించొద్దు’ అంటూ వార్నింగ్ నోట్ కూడా పెట్టారు. ఈ ఘటన ఢిల్లీలోని వసంత విహార్ లో నిన్న జరిగింది.
వసంత్ అపార్ట్ మెంట్ సొసైటీలోని అపార్ట్ మెంట్ లో ఓ కుటుంబం లోపలి నుంచి తాళం వేసుకుని డోర్లు తీయడం లేదని పోలీసులకు ఫోన్ రావడంతో అక్కడకు వెళ్లారు. డోర్లు పగులగొట్టి మృతదేహాలను గుర్తించారు. బెడ్రూంలో విగతజీవులుగా పడి ఉన్న వారిని మంజు, ఆమె కూతుర్లు అన్షిక, అంకూగా నిర్ధారించారు.
ఇంట్లో సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. ‘‘హెచ్చరిక.. ఇంట్లో ప్రమాదకరమైన గ్యాస్ ఉంది. కార్బన్ మోనాక్సైడ్ వ్యాపించింది. వెలిగించారా పేలిపోతుంది. గది తలుపులు, కిటికీలు తెరిచి గ్యాస్ అంతా బయటకు వెళ్లిపోయేలా చూడండి. అంతకన్నా ముందు క్యాండిల్ వెలిగించడంగానీ, అగ్గిపెట్టె ముట్టించడం వంటివి చేయకండి’’ అని ఆ నోట్ లో పేర్కొని ఉంది. గత ఏడాది సెప్టెంబర్ లో ఆ ఇంటి పెద్ద కరోనా కారణంగా చనిపోయినట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.