ప్రజలు గుడికి వెళ్లేందుకు కూడా అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి: జేసీ ప్రభాకర్ రెడ్డి
- ఏపీలో పాలనలో వైసీపీ వైఫల్యం చెందిందన్న ప్రభాకర్ రెడ్డి
- అందుకే గడపగడపకు తిరుగుతామని అంటోందని వ్యాఖ్య
- ప్రజలు రాళ్లతో కొట్టే రోజులు త్వరలో వస్తాయని విమర్శ
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో పాలనలో వైసీపీ వైఫల్యం చెందిందని, అందుకే గడపగడపకు తిరుగుతామని అంటోందని అన్నారు. అయితే, గడపగడపకు వైసీపీ నేతలు వెళ్తే ప్రజలు రాళ్లతో కొట్టే రోజులు త్వరలో వస్తాయని ఆయన చెప్పారు.
ప్రజలు గుడికి వెళ్లేందుకు కూడా అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితులూ వస్తాయని జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా ఉందని ఆయన చెప్పారు. వైసీపీ నేతల బస్సు యాత్రకు పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన చురకలంటించారు. ప్రజలు రాళ్లు విసిరే అవకాశం ఉందని కాబట్టి వైసీపీ నేతలు జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు.