యాదాద్రి నృసింహుడి సన్నిధికి పోటెత్తిన భక్తజనం

  • కిటకిటలాడుతున్న క్యూ లైన్లు
  • సర్వ దర్శనానికి రెండు గంటల సమయం
  • ప్రత్యేక దర్శనానికి గంట
యాదాద్రి లక్ష్మీనృసింహుడి సన్నిధికి భక్త జనం పోటెత్తారు. ఆదివారం కావడం, ఇంటర్ పరీక్షలు అయిపోవడంతో ఎక్కువ మంది భక్తులు స్వామి వారి దర్శనం కోసం వచ్చారు. క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి. దీంతో స్వామివారి సర్వదర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. 

కాగా, యాదగిరిగుట్టను యాదాద్రిగా పేరు మార్చిన తర్వాత ఆలయ రూపురేఖలను కూడా సీఎం కేసీఆర్ మార్చేసిన సంగతి తెలిసిందే. రెండు నెలల క్రితమే ఆయన చేతులమీదుగానే ఆలయం ప్రారంభమైంది. భక్తులకు యాదాద్రీశుడి దర్శనం లభిస్తోంది.


More Telugu News