బిగ్ బాస్ ఓటీటీ తొలి సీజన్ విన్నర్‌గా బిందు మాధవి
- ముగిసిన తెలుగు బిగ్ బాస్ ఓటీటీ తొలి సీజన్
- అఖిల్‌ను వెనక్కు నెట్టేసి విజేతగా నిలిచిన బిందు మాధవి
- బిగ్ బాస్ తెలుగులో తొలి మహిళా విజేతగా హీరోయిన్
- తెలుగుతో పాటు తమిళ ప్రేక్షకుల మద్దతే కారణమని విశ్లేషణలు
తెలుగు బిగ్ బాస్ ఓటీటీ తొలి సీజన్ విన్నర్‌గా హీరోయిన్ బిందు మాధవి నిలిచింది. శనివారం రాత్రి జరిగిన ఫైనల్ షోలో బిందు మాధవిని షో వ్యాఖ్యాత నాగార్జున అక్కినేని విన్నర్‌గా ప్రకటించారు. బుల్లి తెరపై ప్రసారమైన బిగ్ బాస్ ఐదో సీజన్‌లో ఆకట్టుకున్న అఖిల్ సార్థక్ నుంచి గట్టి పోటీ ఎదురైనా చివరకు బిందు మాధవి విజేతగా నిలిచారు. వెరసి బిగ్ బాస్ తెలుగు వెర్షన్‌లో ఓ మహిళ బిగ్ బాస్ విన్నర్‌గా నిలవడం ఇదే తొలిసారి.
బిగ్ బాస్ టీవీ షోలల్లో అలరించి, టైటిల్ సాధించే దిశగా సాగిన పలువురు కంటెస్టెంట్లు బిగ్ బాస్ ఓటీటీ తొలి సీజన్‌లోనూ కనిపించారు. వీరందరి నుంచి బిందు మాధవికి గట్టి పొటీనే ఎదురైంది. అయినా కూడా వారందరినీ వెనక్కు నెట్టేసిన బిందు మాధవి తెలుగు బిగ్ బాస్ వెర్షన్‌లో తొలి లేడీ విన్నర్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది.
టైటిల్ రేసులోకి వచ్చిన అఖిల్ సార్ధక్ కంటే...బిందు మాధవికి ఓ అంశం బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. తెలుగుతో పాటు తమిళంలోనూ ఆమె పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అఖిల్‌కు తెలుగు ప్రేక్షకుల నుంచే మద్దతు రాగా... బిందు మాధవికి మాత్రం తెలుగుతో పాటు తమిళం నుంచి కూడా భారీ ఎత్తున మద్దతు లభించింది. దీంతోనే అఖిల్‌ను వెనక్కు నెట్టిన బిందు మాధవి విజేతగా నిలిచిందన్న విశ్లేషణలు సాగుతున్నాయి.