రాణించిన ముంబయి బౌలర్లు... 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసిన ఢిల్లీ
- ఐపీఎల్ లో ఢిల్లీ వర్సెస్ ముంబయి
- టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ
- రాణించిన పావెల్, పంత్
- 3 వికెట్లు తీసిన బుమ్రా
ముంబయి ఇండియన్స్ పై టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. ముంబయి ఇండియన్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారీ స్కోరు సాధించాలన్న ఢిల్లీ ఆశలు నెరవేరలేదు. బుమ్రా 3 వికెట్లు తీయగా, రమణ్ దీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టాడు. డేనియల్ శామ్స్ 1, మయాంక్ మార్కండే 1 వికెట్ తీశారు.
ఢిల్లీ బ్యాటింగ్ చూస్తే... 43 పరుగులతో రోవ్ మాన్ పావెల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. పావెల్ 34 బంతులాడి 1 ఫోర్, 4 సిక్సులు బాదాడు. అంతకుముందు, ఓపెనర్ పృథ్వీ షా 24, కెప్టెన్ రిషబ్ పంత్ 39 పరుగులు చేశారు. ఆఖర్లో అక్షర్ పటేల్ 10 బంతుల్లో 2 సిక్సుల సాయంతో 19 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ చేరతారన్న నేపథ్యంలో ఢిల్లీ బౌలర్లు ముంబయిని ఏమేరకు కట్టడి చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.