తెలంగాణ సర్కారీ దవాఖానాలో టీడీపీ ఆక్సిజన్ ప్లాంట్.. వర్చువల్‌గా ప్రారంభించిన చంద్రబాబు
- మహబూబాబాద్ జిల్లా గూడూరు ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్
- రూ.50 లక్షలతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్
- ఇప్పటికే ఏపీలోని కుప్పం, టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్రస్ట్ ఆక్సిజన్ ప్లాంట్లు
తెలంగాణకు చెందిన మహబూబాబాద్ జిల్లా గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో టీడీపీ ఆధ్వర్యంలోని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. రూ.50 లక్షల వ్యయంతో ఏర్పాటైన ఈ ఆక్సిజన్ ప్లాంట్‌ను టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు శనివారం వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు.
ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఏపీలోని చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం సహా శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. తాజాగా గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనూ ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో చంద్రబాబు మాట్లాడుతూ... విపత్తుల సమయంలో ఎన్టీవోలు, సంస్థలు, వ్యక్తులు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు.