యూఎస్ లో తగ్గని 'సర్కారువారి పాట' దూకుడు!
- ఈ నెల 12వ తేదీన విడుదలైన 'సర్కారువారి పాట'
- హీరో .. హీరోయిన్స్ ను కొత్తగా చూపిన పరశురామ్
- ప్రధానమైన బలంగా నిలిచిన మాటలు .. పాటలు
- ఈ నెల 27 వరకూ జోరు కొనసాగే అవకాశం
మహేశ్ బాబు కథానాయకుడిగా 'సర్కారువారి పాట' సినిమా తెరకెక్కింది. ఈ నెల 12వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. తొలి ఆటతోనే వచ్చిన ఈ టాక్ కారణంగా వసూళ్లపై ప్రభావం పడొచ్చని అనుకున్నారు. కానీ ఫస్టు వీక్ లోనే ఈ సినిమా 171 కోట్లకి పైగా గ్రాస్ ను .. 100 కోట్లకి పైగా షేర్ ను వసూలు చేసింది.
తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ఇంతవరకూ ఈ సినిమా అక్కడ 2.2 మిలియన్ డాలర్ల గ్రాస్ ను రాబట్టింది. ఈ సినిమా తరువాత సరైన సినిమా థియేటర్లకు రాకపోవడం కలిసొచ్చింది. ఈ నెల 27వ తేదీన 'ఎఫ్ 3' సినిమా వచ్చేవరకూ 'సర్కారువారి పాట'కు ఢోకా లేదని అంటున్నారు.
మహేశ్ బాబు పాత్రను పరశురామ్ డిజైన్ చేసిన తీరు .. కీర్తి సురేశ్ లోని డిఫరెంట్ యాంగిల్ ను చూపించడం .. మాస్ ఆడియన్స్ కి నచ్చే డైలాగ్స్ .. సాంగ్స్ ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచాయి. అందువల్లనే ఈ సినిమా వసూళ్ల పరంగా తన దూకుడు కొనసాగిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. .
తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ఇంతవరకూ ఈ సినిమా అక్కడ 2.2 మిలియన్ డాలర్ల గ్రాస్ ను రాబట్టింది. ఈ సినిమా తరువాత సరైన సినిమా థియేటర్లకు రాకపోవడం కలిసొచ్చింది. ఈ నెల 27వ తేదీన 'ఎఫ్ 3' సినిమా వచ్చేవరకూ 'సర్కారువారి పాట'కు ఢోకా లేదని అంటున్నారు.
మహేశ్ బాబు పాత్రను పరశురామ్ డిజైన్ చేసిన తీరు .. కీర్తి సురేశ్ లోని డిఫరెంట్ యాంగిల్ ను చూపించడం .. మాస్ ఆడియన్స్ కి నచ్చే డైలాగ్స్ .. సాంగ్స్ ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచాయి. అందువల్లనే ఈ సినిమా వసూళ్ల పరంగా తన దూకుడు కొనసాగిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.