అవంతి శ్రీనివాస్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన బ్రాహ్మణ సంక్షేమ వేదిక
- ఓ టీవీ ఛానల్ రిపోర్టర్ ను అవంతి కులం పేరుతో దూషించారన్న బ్రాహ్మణులు
- పంతులు నీ సంగతి చూస్తానని బెదిరించారని ఆగ్రహం
- అవంతిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు
ఏపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుపై విశాఖ పోలీసులకు బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే రైతు భరోసా కవరేజ్ కు వెళ్లిన ఓ టీవీ ఛానల్ రిపోర్టర్ ను ఉద్దేశించి అవంతి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు బ్రాహ్మణులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. 'పంతులు.. నీ సంగతి చూస్తా' అని అవంతి బెదిరించారు. ఈ నేపథ్యంలో తమ కులం పేరుతో రిపోర్టర్ ను దూషించారంటూ పోలీసులకు బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఫిర్యాదు చేసింది. ఐపీసీ 153 (సీ), 509 (ఏ) ప్రకారం మాజీ మంత్రి అవంతిపై చర్యలు తీసుకోవాలని కోరారు.