బెంగళూరును దాటేసిన హైదరాబాద్!.. టైమ్స్ కథనాన్ని కోట్ చేస్తూ కేటీఆర్ ట్వీట్!
- ఆఫీస్ స్పేస్ లీజుల్లో టాప్ దిశగా హైదరాబాద్
- ఇప్పటికే బెంగళూరును దాటేసిన వైనం
- టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రత్యేక కథనం
- కారణాలేంటో చెబుతూ కేటీఆర్ ట్వీట్
ఐటీ రంగంలో బెంగళూరు, హైదరాబాద్‌ల మధ్య చాలా కాలం నుంచే పోటీ వాతావరణం సాగుతున్న సంగతి తెలిసిందే. ఐటీ రంగంలో తొలి స్థానంలో ఉన్న బెంగళూరును దాటేసి ఆ స్థానంలో హైదరాబాద్‌ను నిలపాలన్న కసితో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చాలా కాలంగా శ్రమిస్తున్నారు.
ఈ దిశగా ఏ చిన్న అవకాశం దొరికినా దానిని ఆయన వదలడం లేదు. ఈ క్రమంలో ప్రముఖ ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాలో శనివారం ఓ కథనం ప్రచురితమైంది. ఆఫీస్ స్పేస్ లీజులో బెంగళూరు నగరాన్ని దాటేసిన హైదరాబాద్ ఈ విభాగంలో టాప్ పొజిషన్‌లోకి దూసుకెళుతోందంటూ ఆ కథనం పేర్కొంది.
ఇదే కథనాన్ని కోట్ చేస్తూ కేటీఆర్ శనివారం ఓ ట్వీట్ చేశారు. ఆఫీస్ స్పేస్ లీజులో హైదరాబాద్ సత్తా చాటుతున్నదని పేర్కొన్న కేటీఆర్... అందుకు గల కారణాలను కూడా ప్రస్తావించారు. తక్కువ అద్దెలే ఆఫీస్ స్పేస్ లీజుల్లో హైదరాబాద్‌ను అగ్ర స్థానానికి తీసుకెళుతున్నాయని కేటీఆర్ తెలిపారు.